బ్యాంకాక్ లో మొదలైన చరణ్ హంగామా

Saturday,May 12,2018 - 05:40 by Z_CLU

రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫ్రెష్ షెడ్యూల్ ఇవాళ్టి నుంచి బ్యాంకాక్ లో మొదలైంది. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది.

ఈ షెడ్యూల్ లో హీరో చరణ్, హీరోయిన్ కైరా అద్వానీ మధ్య ఓ సాంగ్ తో పాటు.. సినిమాకు సంబంధించి మరికొన్ని కీలక సన్నివేశాల్ని పిక్చరైజ్ చేయబోతున్నారు. యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ లో సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ బ్లాక్ ను తీయబోతున్నారు.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రామోజీ ఫిలింసిటీలో ఓ షెడ్యూల్, అల్యూమినియం ఫ్యాక్టరీలో మరో షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ మూవీలో స్నేహ, ప్రశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.