ఫిదాతో నితిన్ కనెక్షన్

Saturday,May 12,2018 - 03:28 by Z_CLU

మెగా హీరో వ‌రుణ్‌ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఫిదా సినిమా. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం గతేడాది జూలై 21న విడుద‌లై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సాయి ప‌ల్ల‌విని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ను చేసింది ఫిదా.

అప్పటివరకు కాస్త నష్టాల్లో ఉన్న దిల్ రాజును పూర్తిగా ఒడ్డున పడేసింది ఫిదా సినిమా. అందుకే సెంటిమెంట్ కొద్దీ తన నెక్ట్స్ సినిమాను కూడా జులై 21న విడుదలకు సిద్ధం చేస్తున్నాడు దిల్ రాజు. అదే శ్రీనివాసకల్యాణం.

దిల్‌రాజు, నితిన్ కాంబోలో స‌తీశ్ వేగేశ్న తెరకెక్కిస్తున్న చిత్రం `శ్రీనివాస క‌ల్యాణం`. రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాను కూడా ఫిదా రోజునే విడుద‌ల చేయాల‌ని దిల్‌రాజు భావిస్తున్నాడ‌ట‌. మరి దిల్ రాజు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..? `శ్రీనివాస క‌ల్యాణం` సక్సెస్ అవుతుందా,,?  వెయిట్ అండ్ సీ