రామ్ పోతినేని ఇంటర్వ్యూ

Tuesday,October 24,2017 - 04:57 by Z_CLU

‘ఉన్నది ఒకటే జిందగీ’ అంటూ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్… రామ్-కిషోర్ తిరుమల సూపర్ హిట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా నెల 27న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ఎనర్జిటిక్ స్టార్ మీడియాతో మాట్లాడాడు.

 

దాని మీదే ఎక్కువ ఫోకస్

నిజానికి ఈ సినిమాలో “వాట్ అమ్మ” అనే సాంగ్, ట్రైలర్ లో వచ్చే కొన్ని సీన్స్ చూసి ఇదొక లవ్ ఫెల్యూర్ స్టోరీ అనుకుంటున్నారు. నిజానికి ‘నేను శైలజ’ లవ్ ఫెల్యూర్ స్టోరీ.. కాని ఇందులో ఫ్రెండ్ షిప్ మీదే ఎక్కువ ఫోకస్ చేశాం. లవ్ కూడా ఉంటుంది కానీ సినిమా చూశాక లవ్ కంటే ఫ్రెండ్ షిప్ కే ఎక్కువ కనెక్ట్ అవుతారు.

 

అందరికీ కనెక్ట్ అయ్యే కథ

ఈ సినిమా కథ విషయానికొస్తే మూడు దశల్లో ఓ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చూపించాం. చిన్నప్పుడు..కాలేజ్ డేస్..ఆ తర్వాత.. ఇలా మూడు స్టేజెస్ లో స్టోరీ రన్ అవుతుంది. ఏదీ తెలియని వయసులో ఎలా ఉంటాం.. ఆ తర్వాత కాలేజ్ డేస్ లో ఎలా ఉంటాం.. దాని తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది సినిమా కథ. ఈ దశల్లో స్నేహం ఇంపార్టెన్స్ ఏంటనేది చూపించాం. ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ను గుర్తుచేసే సినిమా.

డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నా

హైపర్ సినిమా తర్వాత ఒక డిఫరెంట్ లుక్ తో కొత్త కథ చేయాలనుకున్నా . అందుకే లుక్ కోసం చాలా టైం తీసుకున్నా..15వ సినిమా అని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టలేదు. ప్రతీ సినిమాకి ఏదో ఓ కొత్త వేరియేషన్ చూపించి ఎంటర్టైన్ చేయాలనుకుంటా. ఫైనల్ గా ఈ సినిమా కుదిరింది.

అవి వర్కవుట్ అవ్వలేదు

ఈ సినిమాకు ముందు కొన్ని కథలు విన్నాను. వాటిలో కొన్ని ఎగ్జైట్ మెంట్ కలిగించాయి. బట్ అవి వర్కవుట్ అవ్వలేదు. ఫైనల్ గా ఈ కథ బాగా నచ్చింది. కిషోర్ కి నాకు మంచి అనుబంధం ఉండటంతో ఈ కథకే ఫిక్స్ అయిపోయా.

 

అవి పట్టించుకోను

నేను శైలజ తర్వాత మా కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలుంటాయి. కానీ ఈ కథ వినేటప్పుడు అవన్నీ పట్టించుకోలేదు. జస్ట్ కథ నచ్చితే చేసేస్తా.. నిజానికి ఎక్స్ పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు పట్టించుకోను. అది డైరెక్టర్- నిర్మాతే చూసుకుంటారు.

 

మా జిందగీ నుంచి కూడా

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో కిషోర్, నేను చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. నేను చెప్తుంటే కిశోర్ వాటిలో నుంచి కొన్ని సీన్స్ రాసేవాడు. అలా తన లైఫ్ లో, నా లైఫ్ లో జరిగిన కొన్ని ఎలిమెంట్స్ సినిమాలో యాడ్ చేశాం. అలా నా జిందగీలో స్నేహితుల మధ్య జరిగిన కొన్ని ఎమోషన్స్, హ్యాపీనెస్ ను స్క్రిప్ట్ లో యాడ్ చేశాడు కిషోర్.

అస్సలు సంబంధం ఉండదు

ఈ సినిమాలో నేను చేసిన అభిరామ్ క్యారెక్టర్ కి ‘నేను శైలజ’లో చేసిన హరి క్యారెక్టర్ కి అస్సలు పోలిక ఉండదు. అభి క్యారెక్టర్ అందరికీ ఓ రోల్ మోడల్ లా ఉంటుంది. లైఫ్ అంటే చాలా సింపుల్, మనం కాంప్లికేట్ చేసుకుంటున్నామని భావించే క్యారెక్టర్ ఇది. ఒక్కో పరిస్థితిలో అభిరామ్ ను చూస్తే చిరాకేస్తుంది కూడా. మరీ ఇంత సింపుల్ గా తీసిపారేస్తున్నాడేంటి అనిపిస్తుంది. కానీ ఫైనల్ గా మనకి కూడా అభి లాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు.

కథ వినకముందే…

నిజానికి ఈ సినిమా కథ వినకముందే ఓ డిఫరెంట్ లుక్ ట్రై చేయాలని గడ్డం, జుట్టు పెంచాను. ఈ స్క్రిప్ట్ విన్నాక రాక్ బ్యాండ్ గిటార్ ప్లేయర్ కోసం ఆ గెటప్ లోకి షిఫ్ట్ అయ్యాను. రాక్ బ్యాండ్ ప్లేయర్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటారు కాబట్టి ఈ లుక్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది. నేను కిషోర్ అనుకుని అదే లుక్ కంటిన్యూ చేశాం.

 

సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ పెద్ద ఎస్సెట్

ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే నేను కిషోర్ దేవిప్రసాద్ కే ఫిక్స్ అయ్యాం. దేవిశ్రీతో నాకిది ఐదో సినిమా. ఎప్పుడు నాకు ది బెస్ట్ మ్యూజిక్ ఇస్తుంటాడు. ఈ సినిమాకు కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి ది బెస్ట్ అనిపించుకున్నాడు. రీ-రికార్డింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఫోన్ చేసి కొన్ని సీన్స్ బాగున్నాయని చెప్పేవాడు. నేను ఎక్కడెక్కడ బాగా చేశానో చెబుతూ ఎనర్జీ ఇస్తాడు.

 

రెండిటికీ డిఫరెన్స్ చెప్పాం

సినిమాలో స్నేహానికి -ప్రేమకి ఉండే డిఫరెన్స్ చెప్పాం. నువ్వుంటే బాగుంటుంది అనేది స్నేహం, నువ్వు లేవు ఇక్కడ.. మిస్ యు అంటే అది ప్రేమ. అని సింపుల్ గా చెప్పడం జరిగింది. ఈ రెండింటికి ఉన్న తేడాను డైరక్టర్ కిషోర్ చాలా సింపుల్ డైలాగ్స్ తో చెప్పాడు. ఇప్పటికే ట్రైలర్ లో అవి బాగా పాపులర్ అయ్యాయి.

శ్రీ విష్ణు అదరగొట్టేశాడు

ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను, కిశోర్ ఈ రోల్ కి సింపుల్ గా జస్ట్ ఇన్నోసెంట్ ఫేస్ ఉండే ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనుకున్నాం. సడెన్ గా శ్రీ విష్ణు పేరు చెప్పాడు కిశోర్. వెంటనే ఫిక్స్ చేశాం. వాసు రోల్ లో శ్రీవిష్ణు చాలా బాగా చేసాడు.

ది బెస్ట్ అనిపించుకున్నారు

సినిమాలో మహా అనే క్యారెక్టర్ చేసింది అనుపమ. మ్యాగీ అనే క్యారెక్టర్ లో లావణ్య కనిపిస్తుంది. మహా అనేది అనుపమకి అపోజిట్ క్యారెక్టర్. లావణ్య రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ మ్యాగీ క్యారెక్టర్ కూడా ఆలాగే ఉంటుంది. ఇద్దరు చాలా బాగా చేశారు.

 

ఫైనల్ డెసిషన్ నాదే..

ఏ కథైనా పెదనాన్న (స్రవంతి రవికిషోర్), నేను కలిసే వింటాం. ఆ స్క్రిప్ట్ లో ఆయనకేం నచ్చిందో.. నాకేం నచ్చిందో చెప్పుకుంటూ మా ఇద్దరి మధ్య చిన్న డిబేట్ ఉంటుంది. ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే. ఆయనతో డిస్కషన్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.


రిజెక్ట్ చేయలేదు .. కుదర్లేదంతే

అనిల్ రావిపూడి చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చింది. బాగా ఎగ్జైట్ అవ్వడంతో అనౌన్స్ కూడా చేశాను. సినిమా రిజెక్ట్ చేయలేదు కానీ ఎందుకో కుదర్లేదంతే. మిస్ అయిన సినిమా గురించి పెద్దగా ఆలోచించను.

టైం తీసుకుంటా.. రీజన్ అదే

ప్రతీ సినిమాకు కొంచెం టైం తీసుకుంటా.. ఏదో చేసేయ్యాలి అనుకోకుండా.. ఓ మంచి కథ ఆ కథను సరిగ్గా ప్రెసెంట్ చేసే విషయంపై బాగా కేర్ తీసుకుంటా. అందుకే నా ప్రతీ సినిమాకు కొంచెం గ్యాప్ ఉంటుంది. హైపర్ కంటే ముందు కూడా చాలా టైం తీసుకున్నా. కథ వినగానే సినిమా చెయ్యాలి అనే ఊపు రావాలి. ఆ తరవాత అన్ని కుదరాలి. అప్పుడే స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ సినిమాకి కూడా ఇంతే టైం తీసుకుంటా.

అలాంటి కథలొస్తే తప్పకుండా చేస్తా..

మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని ఉంది. వెంకటేష్ గారితో మసాలా సినిమా చేశా. నాకు నచ్చే మల్టీస్టారర్ స్క్రిప్ట్ వస్తే చేయడానికి ఎప్పుడూ రెడీనే. ఇక తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమా చేయాలని ఉంది. కానీ అది అంత ఈజీ కాదు. రెండు రాష్ట్రాల ఆడియన్స్ ను ఒకే సినిమాతో మెప్పించడం చాలా కష్టం. సినిమా విషయంలో తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచులు వేరు. నేను చెన్నైలో పుట్టిపెరిగాను, ఎన్నో తమిళ సినిమాలు చూశాను కాబట్టి నాకు తెలుసు. రెండు రాష్ట్రాల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే స్క్రిప్ట్ దొరికితే కచ్చితంగా చేస్తా.