2.0 ఆడియో: ప్రత్యేక అతిథిగా కమల్ హాసన్

Tuesday,October 24,2017 - 02:49 by Z_CLU

ఓవైపు రజనీకాంత్, మరోవైపు కమల్ హాసన్… ఈ ఇద్దరు లెజెండ్స్ ను ఒకే వేదికపై చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. అలాంటి ఘట్టం ఈ వీకెండ్ ఆవిష్కృతం కానుంది. రజనీకాంత్ నటించిన మోస్ట్ ఎవెయిటెడ్, భారీ బడ్జెట్ మూవీ 2.0 ఆడియో రిలీజ్ కు కమల్ హాసన్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈనెల 27న దుబాయ్ లో జరగనున్న 2.0 ఆడియో ఫంక్షన్ లో కమల్-రజనీ కాంబినేషన్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

కమల్ హాసన్ ఎప్పీయరెన్స్ తో పాటు 2.0 ఆడియో ఫంక్షన్ లో మరిన్ని ఎట్రాక్షన్ ఉన్నాయి. ఆ రోజు వేదికపై కమల్-రజనీకాంత్ ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడతారు. తమ సినీప్రయాణాన్ని ఆడియన్స్ తో పంచుకుంటారు. ఎట్ ది సేమ్ టైం రజనీకాంత్, అక్షయ్ కుమార్ కూడా ఇదే స్టేజ్ పై కలిసి ముచ్చటిస్తారు. ఇక ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ కన్సర్ట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 120 మంది సింఫనీ ఆర్కెస్ట్రాతో లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు రెహ్మాన్.

దుబాయ్ లోని బుర్జ్ పార్క్ లో ఆడియో వేడుక ఎరేంజ్ మెంట్స్ ప్రారంభమయ్యాయి. దుబాయ్ లోని మెట్రో రైల్ స్టేషన్, ఎయిర్ పోర్ట్ లాంటి కీలకమైన జంక్షన్లలో 2.0 పోస్టర్లను భారీగా ఏర్పాటుచేశారు. దుబాయ్ లోని కీలకమైన ప్రాంతాలు, షాపింగ్స్ మాల్స్ లో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి ఆడియో రిలీజ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. వేడుకకు సంబంధించి ఇప్పటికే 12వేల మందిని ఆహ్వానించారు మేకర్స్.

ఆడియో ఫంక్షన్ రోజున 2.0 సినిమాకు సంబంధించి కేవలం తమిళ వెర్షన్ క్లిప్స్ మాత్రమే ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్ లో జరిగే మరో భారీ ఈవెంట్ లో తెలుగు క్లిప్స్ ప్రసారం చేస్తారు. ఆడియో ఫంక్షన్ కు ఒకరోజు ముందు, అంటే 26వ తేదీన ఇంటర్నేషనల్ ప్రెస్ తో భారీ మీడియా సమావేశం ఏర్పాటుచేయబోతున్నారు.