డిఫెరెంట్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తున్న రామ్

Thursday,October 31,2019 - 09:03 by Z_CLU

రామ్ కొత్త లుక్స్ పై ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. మాస్ అవతార్ లో మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు రామ్. ఇంకా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. దానికి రీజన్ రామ్ లుక్స్. గత కొన్ని సినిమాలుగా ఇలా డిఫెరెంట్ లుక్స్ ని ప్రిఫర్ చేస్తూ, బిగినింగ్ నుండే సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాడు రామ్.

ఉన్నది ఒకటే జిందగీ – ఈ సినిమాలో లుక్స్ యూత్ కి చాలా కనెక్ట్ అయ్యాయి. సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే, ఫ్యాన్స్ ఆ హెయిర్ స్టైల్ ని ఫాలో అయిపోయారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి రామ్ లుక్స్.

ఇస్మార్ట్ శంకర్ – మాస్ గెటప్… సినిమాలో క్యారెక్టర్ కి ఉన్న హైపర్ క్వాలిటీ రామ్ లుక్స్ లో కూడా కనిపించింది. హెయిర్ స్టైల్, గెడ్డం దగ్గరి నుండి కాస్ట్యూమ్స్ వరకు కొత్తగా కనిపించి టాలీవుడ్ కి కొత్త ఎనర్జిటిక్ స్టార్ ని పరిచయం చేశాడు.

RED – కల్ట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయినప్పుడే, ఇంతకీ ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? అనే క్వశ్చన్ ని రేజ్ చేసింది. ఎప్పుడూ డిఫెరెంట్ హెయిర్ స్టైల్స్ ని ప్రిఫర్ చేసే రామ్, ఈసారి పొట్టి జుట్టుతో మెస్మరైజ్ చేస్తున్నాడు.