ఇస్మార్ట్ శంకర్ – సక్సెస్ ఫుల్ గా 100 రోజులు

Friday,October 25,2019 - 11:30 by Z_CLU

రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించిన సినిమా.. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ గా ఫ్యాన్స్ లో ఇమేజ్ ఉన్న ఈ హీరోకి  ‘అవకాశం దొరకాలి కానీ ఎలాంటి క్యారెక్టర్ లోనైనా ఇరగదీస్తాడు’ అని నిరూపించిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఈరోజు సక్సెస్ ఫుల్ గా 100 రోజులు కంప్లీట్ చేసుకుంది.

రామ్.. పూరి కాంబినేషన్ అనగానే సెట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ ని 100% రీచ్ అయింది ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ ఈ సినిమాలో తనలోని మాస్ విశ్వరూపం చూపించాడు. నెవర్ సీన్ బిఫోర్ లుక్స్ లో, హైపర్ క్యారెక్టరైజేషన్ తో దుమ్ము దులిపాడు అనిపించుకున్నాడు. జస్ట్ ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ లో వైబ్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిన పూరి, సినిమా రిలీజ్ తరవాత పూరి ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు.

సినిమా రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన అంచనాలు ఏ మాత్రం తొణకలేదు. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ అందుకుంటే.. సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకునేంత వరకు ఎక్కడా ఆగలేదు. ఈ సక్సెస్ ఊపులోనే ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి.. దీని సీక్వెల్ కూడా అనౌన్స్ చేసేశాడు. అంతగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.