అలనాటి నటి గీతాంజలి ఇక లేరు

Thursday,October 31,2019 - 09:15 by Z_CLU

ప్రముఖ సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గీత.

సీతారామకల్యాణం, లేత మనసులు, మురళీకృష్ణ, కాలం మారింది, సంబరాల రాంబాబు, డాక్టర్ చక్రవర్తి లాంటి సినిమాల్లో గీతాంజలి నటనకు ప్రశంసలు దక్కాయి. మరీ ముఖ్యంగా ఆమె నటించిన సీత పాత్ర ఎవర్ గ్రీన్.

జానపద చిత్రాల్లో పద్మనాభంతో కలిసి ఆమె ఎన్నో చిత్రాల్లో నటించారు. హీరోయిన్ పాత్రలు ఆపేసిన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న గీతాంజలి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఓ వెలుగు వెలిగారు. పెళ్లైన కొత్తలో సినిమాలో ఆమె క్యారెక్టరే హైలెట్. ఇలాంటి ఎన్నో పాత్రలు పోషించారామె.

నటుడు రామకృష్ణ ఆమె భర్త. ఈమెకు ఒక కుమారుడు. 1957లో కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. సినిమాల్లో గీతాంజలి పేరుతో స్థిరపడ్డారు. గీతాంజలి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తంచేస్తోంది జీ సినిమాలు.