జీ సినిమాలు ( 31st అక్టోబర్ )

Wednesday,October 30,2019 - 10:02 by Z_CLU

యూరి

నటీనటులు విక్కీ కౌశల్పరేష్ రావల్యామి గౌతమ్

ఇతర నటీనటులు :  రజిత్ కపూర్ఇవాన్ రోడ్రిగ్స్యోగేష్ సోమన్మానసి పారేఖ్ గోహిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్ దేవ్

డైరెక్టర్ : ఆదిత్య ధార్

ప్రొడ్యూసర్ : రోని స్క్రూవాలా

రిలీజ్ డేట్ : 11 జనవరి 2019

యూరి – ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాతో ఆదిత్య ధర్‌ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మేజర్‌ విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తుంటాడు. విహాన్‌ పాత్రలో విక్కీ కౌశల్‌ నటించాడు. విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్ చేయడంలో నిపుణుడు. అయితే.. విక్కీ తల్లికి అల్జీమర్స్‌ వ్యాధి వస్తుంది. దీంతో.. ఆమెను చూసుకునేందుకు తనను బోర్డర్‌ నుంచి రాజధాని ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయమని అడుగుతాడు. దీనివల్ల తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవచ్చేనేది విక్కీ ఆలోచన. అయితే.. ఇదే సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. జాతీయ భద్రతా సలహాదారు పర్యవేక్షణలో ఈ స్ట్రైక్స్‌ జరుగుతాయి. దీంతో.. ఆర్మీ పిలుపు మేరకు మళ్లీ బోర్డర్‌కు వచ్చి తనకు అప్పగించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ లీడ్‌ చేసి దిగ్విజయంగా పూర్తి చేస్తాడు విక్కీ. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్‌ పాత్రలో పరేష్‌ రావల్‌ నటించాడు.

==============================================================================

కళ్యాణ వైభోగమే
నటీనటులు : నాగశౌర్యమాళవిక నాయర్
ఇతర నటీనటులు : రాశిఆనంద్ప్రగతినవీన్ నేనిఐశ్వర్యతాగుబోతు రమేష్ మరియుతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి
డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి
ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 4 మార్చి 2016
నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..అనేదే ఈ సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.

==============================================================================

శైలజా రెడ్డి అల్లుడు
నటీనటులు : నాగ చైతన్యఅనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్నరేష్మురళీ శర్మకళ్యాణి నటరాజన్వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్
డైరెక్టర్ మారుతి దాసరి
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018
ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనంఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ).
తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడువాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

==============================================================================

బలాదూర్

నటీనటులు : రవితేజఅనుష్క శెట్టి

ఇతర నటీనటులు : కృష్ణచంద్ర మోహన్ప్రదీప్ రావత్సునీల్బ్రహ్మానందంసుమన్ శెట్టి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధాకృష్ణన్

డైరెక్టర్ : K.R. ఉదయ శంకర్

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2008

బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు చంటి. అందుకే అస్తమానం తండ్రితో మాటలు పడుతుంటాడు. అలాంటప్పుడు కూడా చంటి పెదనాన్న రామకృష్ణ చంటికి సపోర్టివ్ గా ఉంటాడు. అందుకే చంటికి పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటే ఉమాపతి రామకృష్ణని ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు చంటి ఏం చేస్తాడు..ఎలా తన కుటుంబాన్ని… రామక్రిష్ణని కాపాడుకుంటాడు..అనేదే సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

స్పైడర్
నటీనటులు : మహేష్ బాబురకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్యభరత్, RJ బాలాజీప్రియదర్శిజయప్రకాష్సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017
ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు.
అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

==============================================================================

బ్రూస్ లీ

నటీనటులు రామ్ చరణ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు అరుణ్ విజయ్కృతి కర్బందానదియాసంపత్ రాజ్బ్రహ్మానందంఆలీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.