రామ్ పోతినేని - ఇప్పటి నుండి ఇంకో లెక్క

Wednesday,October 30,2019 - 09:03 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లెక్క మార్చాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ తో తన కరియర్ ని డిఫెరెంట్ ట్రాక్ ఎక్కించేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వరస సినిమాలు చేస్తూ.  ఓ డిఫెరెంట్ సినిమా చేయాలనే ఉద్దేశంతో ‘ఇస్మార్ట్ శంకర్’ చేయలేదు. లెక్క మార్చాలని ఫిక్సయ్యే చేశాడు. రీసెంట్ గా రిలీజైన ‘RED’ సినిమా ఫస్ట్ లుక్ గమనిస్తే ఆ విషయం క్లియర్ గా తెలిసిపోతుంది.

నిన్నా మొన్నటి వరకు ఫ్యామిలీ సినిమాల హీరో… రామ్ సినిమా రిలీజయిందంటే పోస్టర్ నిండా ఫ్యామిలీ ఉండాల్సిందే. అయితే వరసగా ఈ సినిమాలు సక్సెస్ అవుతుండటంతో ఈ సక్సెస్ ఫార్ములాను కొన్ని సినిమాల వరకు వాడేశాడు రామ్. కానీ ఈ హీరోలోని రియల్ పర్ఫామెన్స్ స్టాండర్డ్స్ ఎలివేట్ అయింది ‘ఇస్మార్ట్ శంకర్’ లోనే…

రామ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్స్ ఆడియెన్స్ కి కొత్త కాదు. ఫైట్స్ కొత్త కాదు.. ఎటువంటి ఎమోషన్ అయినా అంతే న్యాచురల్ గా డెలివర్ చేస్తాడు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం రామ్ లోని కల్ట్ ఆంగిల్ ని ప్రెజెంట్ చేసింది. స్క్రీన్ పై రామ్ కనిపించిన ప్రతి క్షణం ఆడియెన్స్ కి ఫీస్ట్ ఫీలింగ్ ని ఇచ్చింది. అల్టిమేట్ గా రామ్ మార్చిన లెక్క సక్సెస్ ఫుల్ అని ప్రూఫ్ అయింది.

అందుకే ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో ‘RED’ లో మరో కల్ట్ అవతారంలో కనిపించబోతున్నాడు రామ్. ఫ్యాన్స్ అంచనా కరెక్టయితే ఇకపై చేయబోయే సినిమాలన్నీ డిఫెరెంట్ మ్యానరిజంతో, స్టైలిష్ ఇంపాక్ట్ కన్నా, కల్ట్ డోస్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడనిపిస్తుంది.