ఏం చేయబోతున్నాడు రామ్ పోతినేని..?

Wednesday,October 23,2019 - 10:02 by Z_CLU

రామ్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది..? చేయబోయేది ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనరా..? యాక్షన్ బేస్డ్ సినిమానా..? ఇవన్నీ కాదని ఏదైనా ఎమోషనల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంచుకుంటాడా…? ఏం చేయబోతున్నాడు…? ఎప్పటిలా రెగ్యులర్ సినిమా చేసి ఉంటే రామ్ పై ఈ స్థాయి ఫోకస్ ఉండేది కాదేమో… కానీ రీసెంట్ గా చేసింది ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా రామ్ ని టోటల్ గా డైలమాలో పడేసింది.

రామ్ కరియర్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి ముందు.. ఆ తరవాత అనే స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అందుకే ఇప్పుడీ హీరో ఏం చేసినా అది ఈ సినిమా రామ్ చుట్టూ క్రియేట్ చేసిన రేంజ్ ని దాటే స్థాయిలో ఉండాలి. కాస్త అటూ, ఇటూ అయినా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యే ప్రమాదముంది.

ఈ సినిమా ‘రామ్ ఇలా కూడా చేయగలడా..?’ అనే అప్రీసియేషన్ తో పాటు ఈసారి డెఫ్ఫినెట్ గా మరింత డిఫెరెంట్’ గా చేస్తాడు అనే రేంజ్ ని కూడా క్రియేట్ చేసింది. అందుకే ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఏ మాత్రం చాన్స్ తీసుకునే ఆలోచనలో లేడు రామ్.

ఎప్పటిలా మినిమం గ్యారంటీ సినిమా కాకుండా, తన రియల్ స్టామినా ఎలివేట్ సినిమాపై ఫోకస్ పెట్టిన రామ్, ఇమ్మీడియట్ గా సినిమాని ఓకె చేయకుండా, నెక్స్ట్ లెవెల్ అనిపించే స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.