రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్

Thursday,July 27,2017 - 10:06 by Z_CLU

ప్రెజెంట్ సుకుమార్ డైరెక్షన్ లో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్న చరణ్ ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే కొరటాల శివతో ఓ సినిమా అనౌన్స్ చేసిన చరణ్ మరో ఇద్దరు డైరెక్టర్స్ ను కూడా ఫిక్స్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడట..

ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో విల్లేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్న చరణ్ ఈ సినిమాలో న్యూ లుక్ తో డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాతో సంక్రాంతి కి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు చెర్రీ.

సుకుమార్ సినిమా పూర్తవ్వగానే రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుందని, కొరటాల-మహేష్ సినిమా గ్యాప్ లో చెర్రీ ఈ సినిమాను సెట్స్ పై ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. అన్ని కుదిరితే అయితే ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో ఉంటుందని సమాచారం.

అప్పట్లో చరణ్-కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమా స్టార్ట్ అయి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా ఈ కాంబో ను సెట్స్ పై పెట్టడానికి డిసైడ్ అయ్యాడు చెర్రీ. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తన నిర్మాణంలో కొరటాల శివ తో సినిమా అనౌన్స్ చేసిన చరణ్ నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడని సమాచారం.

ఇక కొరటాల శివ సినిమాతో పాటే మరో వైపు బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ లో కూడా ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు చెర్రీ.  ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలియజేయనున్నారని టాక్. అన్ని కుదిరితే ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.. సో ఇలా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ తన డైరీ ని ఫిల్ చేసుకుంటున్నాడన్నమాట మెగా పవర్ స్టార్.