ఈనెల 31న 'యుద్ధం శరణం' టీజర్

Thursday,July 27,2017 - 12:04 by Z_CLU

రారండోయ్ వేడుక చూద్దాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న నాగచైతన్య, అదే ఊపులో మరో మూవీ రెడీ చేస్తున్నాడు. కృష్ణ మరిముత్తు అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ యుద్ధం శరణం అనే సినిమా చేస్తున్నాడు చైతూ. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా టీజర్ ను ఈనెల 31న విడుదల చేయబోతున్నారు.

ఫస్ట్ లుక్ తో ఇప్పటికే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది యుద్ధం శరణం సినిమా. నాగచైతన్య లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ విలన్ గా కనిపించబోతున్నాడట. రేవతి, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పెళ్లిచూపులు ఫేం వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. వారాహి చలనచిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.