రామ్ చరణ్ తీసుకున్న సరికొత్త నిర్ణయం

Friday,May 25,2018 - 02:12 by Z_CLU

రామ్ చరణ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ రంగస్థలం. 1980’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో చెర్రీ చెవిటివాడిలా పర్ఫామ్ చేసిన తీరు క్రిటిక్స్ ని కూడా మెస్మరైజ్ చేసింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా, ఇంకా కొన్ని ఏరియాల్లో అంతే స్ట్రాంగ్ గా ప్రదర్శించబడుతుంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ని ఉద్దేశించి, చెర్రీ ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకుందామని ప్రయత్నం చేసిన మీడియాకి ఎక్స్ పెక్ట్ చేయని రెస్పాన్స్ ఇచ్చాడు రామ్ చరణ్.

‘మనం చేసిన సినిమాని ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే చాలు.. ఆ సినిమా సక్సెస్ అయినట్టే.. ఒక యాక్టర్ కి దానికన్నా ఇంకేమీ అవసరం ఉండదు. కలెక్షన్స్ అసలు యాక్టర్స్ కి సంబంధించిన విషయమే కాదు. ఇకపై నేను నటించే ఏ సినిమా పోస్టర్స్ పై కలెక్షన్స్ ఉండవు. నా ఫ్యూచర్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కి కూడా నేనీ రిక్వెస్ట్ చేయబోతున్నాను’ అని చెప్పుకున్నాడు రామ్ చరణ్.

 

ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో నటిస్తున్న చెర్రీ, రీసెంట్ గా బ్యాంకాక్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చెర్రీ. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.