వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’

Friday,May 25,2018 - 04:02 by Z_CLU

అక్కినేని నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘రారండోయ్ వేడుక చూద్దాం’. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ సరిగ్గా ఈ రోజే రిలీజయింది. సాంగ్స్, యాక్షన్ తో పాటు ఇమోషనల్ ఎలిమెంట్స్ తో మెస్మరైజ్ చేసిన ఈ సినిమా, లాస్ట్ ఇయర్ బెస్ట్ సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

‘రారండోయ్ వేడుక చూద్దాం’ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ, దానికి తగ్గట్టు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, వీటన్నింటినీ డామినేట్ చేసే రేంజ్ లో నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఇలా అన్ని ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా, జస్ట్ యూత్ నే కాదు, ఫ్యామిలీస్ ని థియేటర్స్ కి రప్పించడంలో సూపర్ సక్సెస్ అయింది.

 

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి. జగపతి బాబు దగ్గరి నుండి బిగిన్ చేస్తే సినిమాలోని ప్రతి క్యారెక్టర్ న్యాచురల్ గా ఉండి, అందరినీ ఈజీగా కనెక్ట్ అవ్వడంతో ఫస్ట్ వీకెండ్ కూడా క్రాస్ అవకముందే సినిమా సక్సెస్ ట్రాక్ పై నిలబెట్టింది. సినిమా సినిమాకి దిఫెరెంస్ ని మెయిన్ టైన్ చేస్తూ దూసుకుపోతున్న నాగ చైతన్య కరియర్ లో బెస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా.