ఐటమ్ గర్ల్ గా కైరా అద్వానీ

Friday,March 29,2019 - 11:01 by Z_CLU

‘భరత్ అనే నేను’ తో తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయింది. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ తరవాత ఇప్పటి వరకు ఇంకో సినిమా చేయలేదు. జస్ట్ రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటుందా లేకపోతే ఈ గ్యాప్ కూడా కైరా అద్వానీ ప్లానింగా అనేది పక్కన పెడితే, ఈ ముంబై భామ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఐటమ్ సాంగ్ లో నటించింది.

బాలీవుడ్ సినిమా ‘కలంక్’ స్పెషల్ సాంగ్ లో వరుణ్ ధావన్ తో స్టెప్పులేసింది కైరా అద్వానీ. 1940 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే అవకాశం దొరక్కపోయినా, ఒక చిన్న భాగమయినందుకు తెగ మురిసిపోతుంది కైరా అద్వానీ.

‘కలంక్’ దర్శకుడు అభిషేక్ వర్మన్ ఈ సాంగ్ లో కైరా అయితే బావుంటుందని చెప్పీ చెప్పగానే వరుణ్ ధావన్, కైరా తో ఈ విషయాన్ని డిస్కస్ చేయడం, కైరా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా యస్ అనేయడం తో కంప్లీట్ ‘కలంక్’ టీమ్ ఇంప్రెస్ అయిపోయిందట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఒక మీడియా ఇంటరాక్షన్ లో చెప్పుకున్నాడు వరుణ్ ధావన్.

ఇప్పుడీ సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో టీజర్ తో ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ లా మారింది. మరి ఈ స్పెషల్ సాంగ్ అప్పియరెన్స్ కైరాకి, బాలీవుడ్ లో ఏ రేంజ్ మైలేజ్ తీసుకొస్తుందో చూడాలి.