స్టార్ హీరోయిన్ తో యంగ్ హీరో ?

Saturday,March 23,2019 - 05:30 by Z_CLU

బొమ్మరిల్లు భాస్కర్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అఖిల్.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ అప్ కమింగ్ హీరోయిన్స్ తో వర్క్ చేసిన అఖిల్ ఫస్ట్ టైం ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్నాడట. ఈ సినిమాలో అఖిల్ కి హీరోయిన్ గా కియారా అద్వాని ని సంప్రదించారట.

టాలీవుడ్ లో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ తర్వాత రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు బడా సినిమాలతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న కియరా తెలుగులో నెక్స్ట్ చేయబోయే సినిమా అఖిల్ దే అంటున్నారు. ప్రస్తుతానికయితే ఈ వార్త గురించి మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేదు.. కానీ సినిమా అనౌన్స్ మెంట్ తో పాటే కియరా పేరు కూడా ప్రకటిస్తారని టాక్.

తెలుగులో చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ ఎట్టకేలకు అఖిల్ సినిమాతో మళ్ళీ ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తారని తెలుస్తోంది.