స్పైడర్ హంగామాకు కౌంట్ డౌన్ షురూ

Wednesday,May 31,2017 - 05:10 by Z_CLU

మరికొన్ని గంటల్లో స్పైడర్ హంగామా షురూ కాబోతోంది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మోస్ట్ ఎవెయిటింగ్ భారీ బడ్జెట్ సినిమాకు మురుగదాస్ దర్శకుడు.

తండ్రి కృష్ణ ప్రతి పుట్టినరోజుకు తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక సందడి చేయడం మహేష్ కు అలవాటు. ఈ ఏడాది స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ తో ఫ్యాన్స్ లో ఆనందం నింపాలనుకున్నాడు. కానీ దర్శకరత్న దాసరి కన్నుమూతతో ఫస్ట్ లుక్ టీజర్ విడుదలను రేపటికి వాయిదా వేశారు.

ఈమధ్య విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ డిజైన్.. ఆ అంచనాల్ని మరింత పెంచింది. భారీ బడ్జెట్, హై ఎండ్ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాను దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు.