నా జీవితంలో మెమొరబుల్ అదే – రామ్ చరణ్

Thursday,March 14,2019 - 04:36 by Z_CLU

‘RRR’ సినిమా అనౌన్స్ అయిన రోజు ఆడియెన్స్ ఎంత సర్ ప్రైజ్ అయ్యారో, అదే ఫీలింగ్ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు NTR, రామ్ చరణ్ కి కూడా కలిగింది. ఈ సినిమా గురించి పబ్లిక్ గా అనౌన్స్ చేయడానికి కొన్ని రోజుల ముందు, చెర్రీ, తారక్ లను ఇద్దరినీ ఇంటికి పిలిచి, ఇద్దరికీ ఇకేసారి ఈ సినిమా గురించి చెప్పాడంట జక్కన్న. ఆ అనుభవాన్ని ఎంతో ఎగ్జైటెడ్ గా షేర్ చేసుకున్నాడు రామ్ చరణ్.

‘ఒకరోజు నేను ఏదో ఊరికి వెళుతున్నాను. అప్పుడు రాజమౌళి గారు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలోనే ఇల్లు కాబట్టి ఒకసారి వచ్చి వెళ్ళమన్నారు. నేను వెళ్లాను. వెళ్లేసరికి NTR అక్కడ నేల మీద ఓ ఫోజులో రిలాక్స్డ్ గా పడుకుని ఉన్నాడు. అక్కడ ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకుని షాక్ అయ్యాం. తారక్ రాజమౌళి గారితో ఏదైనా మాట్లాడటానికి వచ్చాడేమో అనుకుని, నేను వెయిట్ చేద్దామనుకున్నా, NTR కి కూడా అదే ఫీలింగ్… ఆ కన్ఫ్యూజన్ ని రాజమౌళి అలాగే కాసేపు కంటిన్యూ చేసి, ఆ తరవాత మా ఇద్దరికీ ఒకేసారి ఈ సినిమా గురించి చెప్పారు…’ అని చెప్పుకున్నాడు చెర్రీ…

“రాజమౌళి గారు ఈ 2 క్యారెక్టర్స్ ని ఎంత బాధ్యతగా డిజైన్ చేసుకున్నారో మేము కూడా అంతే బాధ్యతగా ఫీలై ఈ సినిమా చేస్తున్నాం. రాజమౌళి గారితో గతంలో నా కాంబినేషన్ ఎంత సక్సెస్ అయిందో, ఈ సారి కూడా అంతే సక్సెసవుతుందని నమ్ముతున్నాను”.. అని మరింత కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు చెర్రీ.