మా ఫ్రెండ్ షిప్ కి దిష్టి తగలకూడదు

Thursday,March 14,2019 - 01:42 by Z_CLU

NTR, రామ్ చరణ్ లిద్దరూ ‘RRR’ కన్నా ముందు నుండే మంచి ఫ్రెండ్స్.  RRR సినిమాతో ఎప్పుడూ ఫ్యాన్స్ ఫోకస్ లో ఉండే ఈ ఇద్దరి స్టార్స్ ఫ్రెండ్ షిప్ బాండింగ్ కూడా ఫోకస్ లోకి వచ్చేసింది. RRR అనౌన్స్ అయినప్పుడు ఫ్యాన్స్ లో ‘వీళ్ళిద్దరూ ఇంత మంచి మిత్రులా…? అనే ఫీలింగ్ కలిగింది. అందుకే ‘RRR’ లాంచ్ అయిన తరవాత జరిగిన ఈ ఫస్ట్ మీటింగ్ లో రామ్ చరణ్ కి తనకు ఉన్న బంధాన్ని షేర్ చేసుకున్నాడు NTR.

నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి, నా కష్టసుఖాలు కూడా పంచుకోగలిగేంత మిత్రుడు, ఈ సినిమాలో పని చేయకముందు మా మధ్య ఏ బాండింగ్ అయితే  ఏర్పడిందో, అది ఈ సినిమాతో వేరె లెవెల్ కి వెళ్ళిపోయింది. మేమెప్పటికీ  ఫ్రెండ్స్ లా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. మంచి బంధాలు వచ్చినప్పుడు దిష్టి తగులుతుందని అప్పుడప్పుడు మా అమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే మా బంధానికి ఎప్పుడూ దిష్టి తగలకూడదనే, ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముందు మా బాండింగ్ గురించి చెప్తున్నా’. అని చెప్పుకున్నాడు.

‘మనందరికీ అల్లూరి సీతారామరాజు గురించి తెలుసు, కొమురం భీమ్ గురించి తెలుసు… కానీ వాళ్ళిద్దరూ కలిస్తే ఏం జరిగి ఉంటుందోనని జక్కన్నకు వచ్చిన ఆలోచన నిజంగా అద్భుతం. ఈ అద్భుతమైన పాత్రలు  పోషించడానికి మేం తీసుకున్న అద్భుతమైన శిక్షణ భవిష్యత్తులో మేం చేయబోయే సినిమాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.’ అని చెప్పుకున్నాడు NTR.