రామ్ చరణ్ ఇంటర్వ్యూ

Tuesday,January 08,2019 - 05:43 by Z_CLU

డిఫెరెంట్ జోనర్స్ లో చేయడం కన్నా సెన్సిబుల్ సినిమాలు చేయడమే ప్రయారిటీగా పెట్టుకున్నాడు చెర్రీ. ‘రంగస్థలం’  సినిమాలో లాగా    న్యాచురాలిటీకి దగ్గర ఉన్న రోల్స్ చేసినా, ‘వినయ విధేయ రామ’ లాంటి సినిమాలో మాస్ హీరోగా కనిపించినా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతామా లేదా అనేదే నా పాయింట్’. అని చెప్తున్న రామ్ చరణ్, మీడియా ఇంటరాక్షన్ లో తీరిగ్గా తన మనసులో మాటలు చెప్పుకున్నాడు అవి మీకోసం….

ఇది సంక్రాంతి టైటిల్…

నాకు బోయపాటి గారి సినిమా ‘జయ జానకి నాయకా’ టైటిల్ చాలా ఇష్టం. దానికి దగ్గరగా  ఉండాలనే ఈ టైటిల్ ఫిక్సయ్యాం. సంక్రాంతి సీజన్ కి ‘వినయ విధేయ రామ’ పర్ఫెక్ట్ టైటిల్.

బ్యూటిఫుల్లీ డిజైన్డ్…

సినిమాలో నా క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు బోయపాటి గారు. రాముడిలా ఉంటాడు. అయోధ్యలో  ఒకలా, యుద్ధం సమయంలో ఒకలా.. సందర్భాన్ని బట్టి ఎలివేట్ అయ్యే క్యారెక్టర్.

అదే నా కోరిక…

ఒక ఆర్టిస్ట్ గా డిఫెరెంట్ జోనర్స్ సినిమాల్లో నటించాలనుకోవడం కన్నా, సెన్సిబుల్ సినిమాలు చేయాలన్నదే నా కోరిక. బోయపాటి గారితో ఈ సినిమాకు పని చేసిన ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేశాను.

పెద్దగా కష్టం అనిపించలేదు…

‘రంగస్థలం’ సినిమా తరవాత పెద్దగా బ్రేక్ తీసుకోలేదు. మహా అయితే 2 వీక్స్ టైమ్ తీసుకున్నా. కానీ ఈ మాత్రం టైమ్ సరిపోయింది. క్యారెక్టర్ నుండి స్విచ్ అవ్వడానికి.

ప్రతి సినిమా రంగస్థలం కాదు…

ప్రతి సినిమా ‘రంగస్థలం’ సినిమా అంత సక్సెస్ అవ్వాలని, అలాంటి ఫీలే జెనెరేట్ చేయాలని అనుకుంటే కష్టమైపోతుంది. కథ విన్నప్పుడు ఆడియెన్ లా వింటా. సబ్జెక్ట్ విన్నప్పుడు నేను ఎంజాయ్ చేయగలగాలి. డైరెక్టర్ ఆ కథ విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా, క్లారిటీగా ఉన్నాడన్నది చూసుకుంటా అంతే…

బెస్ట్ లీడింగ్ యాక్టర్ గా అవార్డ్…

‘రంగస్థలం’ సినిమాకి బెస్ట్ లీడింగ్ యాక్టర్ గా ‘జీ సినీ అవార్డ్’ అందుకోవడం నిజంగా చాలా సంతోషాన్నిచ్చింది. మనం ఎంత కష్టపడ్డా అది ప్రేక్షకులు ఆదరిస్తేనే సక్సెస్ అయినట్టు. చాలా గ్రేట్ గా ఫీలవుతున్నా.

బ్యాలన్స్డ్ గా ఉంటుంది…  

సినిమాలో జస్ట్ వైలెన్సే ఉంటే క్లీన్ U/A సర్టిఫికెట్ వచ్చేది కాదు. అటు యాక్షన్, ఇమోషన్స్ అన్నీ బ్యాలన్స్డ్ గా  ఉంటాయి సినిమాలో.

అజర్ బైజాన్ షెడ్యూల్…

అజర్ బైజాన్ షెడ్యూల్ అద్భుతంగా వచ్చింది. రాంబో గెటప్ కైతే బోయపాటి గారు చాలా ముందు నుండే ప్లాన్డ్ గా ఉన్నారు. ఆ ట్యాటూ డిజైన్స్ తో సహా ప్రతీది ప్రిపేర్డ్ గా ఉన్నారు.

నా కన్నా నాన్నగారే…

రామ్ కొణిదెల… అని పేరు వినగానే నాన్నగారు నవ్వుతూ, ఎవరి పర్మిషన్ తీసుకుని ఈ పేరు పెట్టారు అని అడిగారు. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నాన్నగారు ఆ డైలాగ్స్ చెప్పడం, సినిమాకి ఇంకా వెయిట్ తీసుకొచ్చింది. నా కన్నా నాన్నగారే ఆ డైలాగ్స్ బాగా చెప్పారు.

నా సీక్రెట్ ఇంస్టా అకౌంట్…

అవును… నాకు కూడా సీక్రెట్ గా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది. నాక్కూడా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే క్రియేట్ చేసుకున్నా.

ఇవే సైరా అప్డేట్స్…

‘సైరా’ షూటింగ్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకో 2 నెలలు పడుతుంది. సమ్మర్ రిలీజ్ అనుకున్నాం కానీ  కుదరకపోవచ్చు. బహుశా దసరాకి అవుతుందేమో. ఇంకా ఫిక్సవ్వలేదు.

నలుగురు అన్నాదమ్ముల కథ…

‘వినయ విధేయ రామ’ నలుగురు అన్నాదమ్ముల కథ. ఆ నలుగురు ఎలా కలిశారు…? ఎలా ఫ్యామిలీగా ఫామ్ అయ్యారు…? అక్కణ్ణించి వాళ్ళ జర్నీ.. అదే సినిమా.

అదే తేడా…

‘రంగస్థలం’ సినిమాకి సుకుమార్ గారు అసలు వర్కవుటే అవసరం లేదన్నారు. అక్కణ్ణించి ఇలా బయటికి వచ్చానో  లేదో, బోయపాటి గారు బాడీ కంపల్సరీ అన్నారు. అజర్ బైజాన్ షెడ్యూల్ కి, అప్పటికీ ఇంకా 4 నెలలు టైమ్ ఉంది కాబట్టి ఈ లోపు ప్రిపేర్ అవ్వగలిగా.

లక్కీగా ఫీలయ్యా…

స్నేహ గారితో నాకు మంచి వర్కింగ్ రిలేషన్ షిప్ ఉంది. ఈ సినిమాతో ఆర్యన్ రాజేష్ కూడా మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు. ఇక మనందరి ఫేవరేట్ ప్రశాంత్ గారు.. వీళ్ళందరితో పని చేయడం లక్కీ అనుకుంటున్నా. వివేక్ ఒబెరాయ్ గారి పర్ఫామెన్స్ అయితే జస్ట్ సూపర్బ్.

భోంచేస్తూ ఫిక్సయిన సినిమా ‘రంగస్థలం’…

జస్ట్ ఏదో ఇద్దరం కూర్చుని భోంచేస్తూ ఫిక్సయిన సినిమా ‘రంగస్థలం’. సింపుల్ గా చేశాం అది అద్భుతమై పోయింది. ఏ సినిమా అయినా అద్భుతం చేద్దామని స్టార్ట్ చేయం, సింపుల్ గా చేస్తాం. ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం. అంతే. తక్కినవన్నీ జరిగిపోతాయి.

పెద్దగా కొత్త అనిపించలేదు…

‘RRR’ ఫస్ట్ షెడ్యూల్ తారక్ నా కాంబినేషన్ లోనే జరిగింది. బేసిగ్గా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కాబట్టి సెట్స్ లో కూడా కొత్తగా అనిపించలేదు. ఈజీగా చేసేశాం.

నేను సైలెంట్ అయిపోయా…

నన్ను తారక్ ని కూర్చోబెట్టి ఇద్దరికీ ఒకేసారి కథ చెప్పారు రాజమౌళి గారు. కథ విన్న తరవాత తారక్ బాగానే రియాక్ట్ అయ్యాడు కానీ, నేను సైలెంట్ అయిపోయా. ఇలాంటి థాట్స్ అసలు ఎలా వస్తాయి ఈయనకి అనిపించింది. ఇక మా ఇద్దరినీ ఒకేసారి స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడమనేది మా చాలెంజ్ కాదు. అది రాజమౌళి గారిది. మా కన్నా ఆయనకే ఈ సినిమాలో ఎక్కువ పని. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా.

కొణిదెల ప్రొడక్షన్స్…

నా బ్యానర్ లో కేవలం నాన్నగారి సినిమాలే ఉంటాయి. ఆయనకోసం ఏదైనా చేయాలి అని చేయడం తప్పితే, నాకు ఈ బ్యానర్ లో ఇంకా వేరే సినిమాలు చేయాలనే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు.

‘RRR’ టైమ్ లెస్ ప్రాజెక్ట్…

‘RRR’ రిలీజ్ ఎప్పుడన్నది ఇప్పట్లో చెప్పడం కష్టం. రాజమౌళి గారికి టైమ్ ఫ్రేమ్ పెడితే పని చేయలేరు. మేము దానికి ప్రిపేర్ అయి ఉన్నాం.

కొరటాల గారు లక్కీ…  

కొరటాల గారు చాలా లక్కీ. నాతో సినిమా చేయాలనుకుంటే ఆయనకు నాన్నగారు దొరికారు. అయినా కొంచెం టైమ్ తీసుకున్నా మా కాంబినేషన్ లో సినిమా తప్పకుండా ఉంటుంది.