రామ్ చరణ్ డైలాగ్స్ చిరు నోట...

Saturday,December 29,2018 - 11:02 by Z_CLU

సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజవుతుంది రామ్ చరణ్ వినయ విధేయ రామ. ఆల్మోస్ట్ సినిమా చూసినంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా ట్రైలర్. రామ్ చరణ్ లుక్స్ దగ్గర నుండి, ఆ మాసివ్ అవతార్ ఫ్యాన్స్ ని టోటల్ గా సర్ ప్రైజ్ చేసేసింది. దానికి తోడు రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘వినయ విధేయ రామ’ నుండి చిరు చెప్పిన రామ్ చరణ్ డైలాగ్స్ మెగా ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపాయి.

బోయపాటి డైరెక్షన్ లో ఫస్ట్ టైమ్ నటించాడు రామ్ చరణ్. అయితే ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఏ రేంజ్ క్యూరియాసిటీ ఉందో, మెగాస్టార్ లోను అదే స్థాయి క్యూరియాసిటీ కనిపిస్తుంది. నిన్న ఈ సినిమా డైలాగ్స్ చెప్తున్నప్పుడు, చిరంజీవికి ఈ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఎలివేట్ అయ్యాయి. నిజానికి రామ్ చరణ్ ని బోయపాటి తో సినిమాకి ప్రోత్సహించింది కూడా నేనే అని మెగాస్టార్ మెన్షన్ చేయడం విశేషం.

తన ఫ్యామిలీని కాపాడుకునే ప్రాసెస్ లో ఏ రేంజ్ కైనా వెళ్ళడానికి సిద్ధపడే వారియర్ లా కనిపించనున్నాడు చెర్రీ ఈ సినిమాలో. DSP ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. D.V.V. దానయ్య మ్యూజిక్ ప్రొడ్యూసర్.