క్యూరియాసిటీ రేజ్ చేస్తున్న ‘మహర్షి’ సినిమా సెట్

Tuesday,January 08,2019 - 01:34 by Z_CLU

దుబాయ్ నుండి రీసెంట్ గా ఇండియాకి వచ్చాడు మహేష్ బాబు. ఫ్యామిలీ తో, క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇక మిగిలింది ‘మహర్షి’ పై మరింత ఫోకస్ పెట్టడమే. అయితే రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించిన ‘మహర్షి’ మేకర్స్, నెక్స్ట్ షెడ్యూల్ ని ‘పొలాచి’ లో ప్లాన్ చేశారు.

అయితే ఇప్పుడు జరుగుతున్న పొలాచి షెడ్యూల్ కన్నా, ఫ్యాన్స్ ఫోకస్ లాస్ట్ షెడ్యూల్ లో జరిగిన రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ లో ఉంది. దానికి రీజన్ ఆ షెడ్యూల్ లో వేసిన స్పెషల్ సెట్. ఈ లొకేషన్ లో, సినిమాలో ఉండబోయే ఇమోషనల్ సీక్వెన్సెస్ తెరకెక్కించారు మేకర్స్. ఈ సీక్వెన్సెస్ కోసం ఎండిపోయిన బీడు భూముల్ని, కరువు ఎఫెక్ట్ తో ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేశారు మేకర్స్.

ఇప్పటి వరకు రిలీజైన టీజర్ లో యంగ్ లుక్ లో మహేష్ బాబును రివీల్ చేసిన మేకర్స్, రీసెంట్ గా రిలీజ్ చేసిన సెకండ్ లుక్ లో రాయల్ లుక్స్ లో ప్రెజెంట్ చేశారు. దీంతో ‘మహర్షి’ సినిమా క్లాస్ గా ఉండబోతుంది అనే ఇమేజ్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయి ఉంది. అయితే ఇప్పుడీ బీడు భూముల సీక్వెన్సెస్ ఏంటి..? అసలు మహేష్ బాబు ‘మహర్షి’ స్టోరీలైన్ ఏంటి..? అనేదే ఇప్పుడు ఫ్యాన్స్ లో రేజ్ అవుతున్న క్వశ్చన్.

ఏప్రిల్ 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది మహేష్ బాబు ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. దిల్ రాజు, అశ్విని దత్ మరియు PVP సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.