ఘనంగా 'జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018' వేడుక

Tuesday,January 08,2019 - 08:11 by Z_CLU

రీసెంట్ గా హైదరాబాద్ లోని కోట్ల విజయ్ భాస్కర రెడ్డి స్టేడియంలో ఘనంగా జరిగింది ‘జీ సినీ అవార్డ్స్ తెలుగు’ ఉత్సవం. ఇప్పటి వరకు వరసగా అప్సర అవార్డ్స్, కుటుంబం అవార్డ్స్, కామెడీ అవార్డ్స్ లాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ అందించిన జీ తెలుగు, ఇదే వరసలో మరింత ప్రతిష్టాత్మకమైన జీ సినీ అవార్డ్స్ ని తెలుగులో అందించింది.

2018 లో జరిగిన మొట్ట మొదటి అవార్డుల వేడుక 3 అవుట్ స్టాండింగ్ కేటగిరీ లలో జరిగింది. జ్యూరీ అవార్డ్స్, ఫేవరేట్ అవార్డ్స్, లతో పాటు గత 3 వారాలుగా ఫేస్ బుక్ వోట్స్ , SMS ల ఓట్ల ద్వారా ఎంపికైన వారికి అవార్డ్స్ అందించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, అల్లు అరవింద్ లాంటి టాలీవుడ్ దిగ్గజాలు పాల్గొనడంతో  మరింత గ్రేస్ ఆడ్ అయింది.

ఈ ఈవెంట్ లో జస్ట్ అవార్డ్స్ మాత్రమే కాదు సూపర్బ్ పర్ఫామెన్స్ తో కలర్ ఫుల్ గా సాగింది. పాప్యులర్ టెలివిజన్ పర్సనాలిటీస్ తో పాటు సినీ తారలు మెహరీన్ కౌర్, రష్మిక మండన్న, కైరా అద్వానీ, రితిక సింగ్, బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫామెన్స్ తో మరింత గ్రాండియర్ గా జరిగింది ఈ ఈవెంట్.    

వీటికి తోడు నందమూరి బాలకృష్ణ ప్రెజెన్స్ లో మహానటుడు NTR కి ఇచ్చిన ట్రిబ్యూట్ ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణ. ‘జీ సినీ అవార్డ్స్ తెలుగు’ లో జస్ట్ ఎంటర్టైన్ మెంట్ మాత్రమే కాదు, ఇమోషనల్ గా కూడా మరింత అలరించింది. త్వరలో ఈ ఈవెంట్ ‘జీ తెలుగు’ తో పాటు ‘జీ తెలుగు HD’ లో ప్రసారం కానుంది.