రెండు భారీ ఈవెంట్లు ప్లాన్ చేసిన బన్నీ

Monday,April 16,2018 - 11:09 by Z_CLU

తన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య సినిమాకు సంబంధించి రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. ఈ రెండు మెగా ఈవెంట్స్ తో సినిమాను పీక్ స్టేజ్ లో నిలబెట్టాలని ఫిక్స్ అయ్యాడు. వీటిలో ఒకటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయితే, రెండోది ప్రీ-రిలీజ్ ఫంక్షన్. తాజాగా ఈ రెండు ఈవెంట్స్ కు డేట్స్ ఫిక్స్ చేశారు.

నా పేరు సూర్య ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఈనెల 22న గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నిజానికి ఈమధ్య బన్నీ సినిమాలకు సంబంధించి ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయలేదు. అలా చాన్నాళ్ల గ్యాప్ తర్వాత నా పేరు సూర్య సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇక మరో ఈవెంట్ ను ఈనెల 29న ప్లాన్ చేశారు. ఇది ప్రీ-రిలీజ్ ఫంక్షన్. ఆడియో రిలీజ్ ను మించిన రేంజ్ లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. ఈ రెండు ఫంక్షన్ల తర్వాత స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇచ్చి మే 4న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.