టీచర్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్

Friday,April 14,2017 - 06:31 by Z_CLU

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు జస్ట్ హీరోయినే కాదు ఇంగ్లీష్ టీచర్ కూడా. లక్ష్మీ మంచు, యాక్టివిస్ట్ చైతన్య MRSK నిర్వహిస్తున్న ‘Teach For Change’ లో భాగంగా తక్కిన వారిలో స్పూర్తిని నింపేందుకు, తన బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా 8th క్లాస్ చదువుతున్న బంజారా హిల్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం టైం స్పెండ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

8th క్లాస్ పిల్లలకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో వ్యతిరేక పదాలతో పాటు, ఇంగ్లీష్ స్పీకింగ్ ఆక్టివిటీస్ ని నిర్వహించింది రకుల్ ప్రీత్ సింగ్. Be The Change, Teach For Change ని ఇంకా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉందని ఫీల్ అయిన రకుల్ ప్రీత్, మనకున్న నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడం వల్ల చాలా స్యాటిస్ ఫ్యాక్షన్ ఉంటుందని చెప్పుకుంది.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్, అటు సినిమాలతో పాటు, ఇటు సోషల్ యాక్టివిటీస్ లోను ఇంట్రెస్ట్ చూపిస్తూ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.