బెస్ట్ ఫస్ట్ లుక్స్ @ 2017

Friday,April 14,2017 - 05:34 by Z_CLU

బోలెడన్ని సక్సెస్ ఫుల్ సినిమాలతో ముగిసింది 2016. ఈ ఇయర్ కూడా అదే జోష్ తో టాలీవుడ్ లో బోలెడన్నీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిన్నా పెద్దా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాగ్జిమం సక్సెస్ రేషియోతో క్లోజ్ అయ్యాయి. అయితే గడిచిన ఈ మూడు నెలల్లో రిలీజైన సినిమాల కన్నా, ఫస్ట్ లుక్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి.

రామ్ చరణ్, సుక్కు సినిమా ఫస్ట్ లుక్, కనీసం సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళలేదు అప్పుడే రిలీజయింది. 1980’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో చెర్రీ, సుక్కు కాంబినేషనే ఓ స్పెషల్ ఎట్రాక్షన్. దానికి తోడు ఈ ఫస్ట్ లుక్ క్రియేట్ చేసిన వైబ్రేషన్స్, సినిమాకి ఎండ్ లెస్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసింది. సునీల్ ఉంగరాల  రాం బాబు కూడా ఈజీగా రీచ్ అయిపోయింది. డిఫెరెంట్ గా డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్, కొన్ని రోజుల పాటు సోషల్  మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ DJ ఫస్ట్ లుక్ ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేసినా, రిలీజ్ అవ్వగానే ఫస్ట్ షాక్ కి గురి చేసింది. బన్ని ఈ సినిమాలో బ్రాహ్మణ కుర్రాడిగా నటిస్తున్నాడనే విషయం తెలిసినా, ఆ నిండైనా, కనీసం ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ కూడా చేయలేదు. ఇక శర్వానంద్ ‘రాధ’ శతమానం భవతి లాంటి డీసెంట్ హిట్ తరవాత తెరకెక్కుతున్న ‘రాధ’ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ సినిమా 100 % బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపించేసింది.

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత బ్రేక్ తీసుకుని మరీ చేస్తున్న సినిమా ‘జై లవకుశ’. సినిమా సినిమాకి మధ్య డిఫెరెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న NTR, ‘జై లవకుశ’ తో సూపర్ హిట్ సినిమా గ్యారంటీ అని సైన్ ఇచ్చేశాడు. ఇక నాని తన లాస్ట్ మూవీ నేను లోకల్ సినిమా రోజే తన నెక్స్ట్ మూవీ సెట్స్ పై ఉన్నాడు. ఈ లోపు ‘నిన్నుకోరి’ ఫస్ట్ లుక్ తో నెక్స్ట్ సినిమా కూడా సూపర్ హిట్టే అని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

 

క్రేజీ కాంబినేషన్, హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్, ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ లో క్రియేట్ అయిన క్యూరాసిటీ, ఏదైతేనేం మహేష్ బాబు స్పైడర్ కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రతి అప్ డేట్ ని డామినేట్ చేసేసింది.

ఈ ఫస్ట్ లుక్స్ ప్రభావమే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా రిలీజ్ అయితే, ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే.