జీ సినిమాలు ( ఏప్రిల్ 15th)

Friday,April 14,2017 - 10:04 by Z_CLU

హీరోహీరోయిన్లు –వరుణ్ సందేశ్, అస్మితా సూద్

నటీనటులు –పూనమ్ కౌర్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, కృష్ణుడు, నాగినీడు, అలీ

సంగీతం –కోటి

దర్శకత్వం –ఈశ్వర్ రెడ్డి

విడుదల తేదీ –2011, జులై 1

ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్లుగా నవ్వుకోవాలంటే బ్రహ్మిగాడి కథ చూడాల్సిందే. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో అందర్నీ నవ్వించేలా  తెరకెక్కింది బ్రహ్మిగాడి కథ. రాయలసీమ యాసలో జయప్రకాష్ రెడ్డి చెప్పిన డైలాగులు, తన సీనియార్టీ అంతా ఉపయోగించి బ్రహ్మానందం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, చేసిన కామెడీ సినిమాకు స్పెషల్  ఎట్రాక్షన్స్. వీటికి తోడు కృష్ణుడు, అలీ  కూడా నవ్విస్తారు. హీరోయిన్ అస్మితా సూద్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

==============================================================================

నటీనటులు : శ్రీకాంత్, చార్మీ

ఇతర నటీనటులు : శివాజీ, గౌరీ ముంజల్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రఘుబాబు, కృష్ణ భగవాన్, L.B. శ్రీరామ్, చలపతి రావు, హేమ, సన తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : సూర్య ప్రసాద్

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 2008 అక్టోబర్ 9

అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సినిమాల్లో నటించిన శ్రీకాంత్ తో రామానాయుడు గారు నిర్మించిన నాలుగో సినిమా కౌసల్యా సుప్రజా రామ. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సూర్యప్రకాష్ దర్శకుడు.

============================================================================

నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రామ్ బాబు

ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010

అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. ఈ సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికి అసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకు చేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన భార్య అన్న అకూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతో తన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ ఏ మలుపు తిరుగుతుందన్న అంశాలు Zee Cinemalu లో చూడాల్సిందే.

=============================================================================

నటీ నటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి

రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012

అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

=============================================================================

నటీనటులు : నరేన్, ప్రసన్న

ఇతర నటీనటులు : అజ్మల్, విజయలక్ష్మి, పాండ్య రాజ్, లివింగ్ స్టన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సుందర్ సి. బాబు

డైరెక్టర్ : మిస్కిన్

ప్రొడ్యూసర్ : నడపన కాంతారావు