రజినీకాంత్ ‘కాలా’ రిలీజ్ డేట్ మారిందా..?

Wednesday,April 11,2018 - 06:32 by Z_CLU

రజినీకాంత్ ‘కాలా’ ఏప్రిల్ 27 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అంతలో ఈ సినిమా రిలీజ్ డేట్ మారే చాన్సెస్ ఉన్నాయన్న న్యూస్, అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను చక్కర్లు కొడుతుంది. ప. రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని జూన్ లో రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఫిల్మ్ మేకర్స్ ఉన్నారన్న న్యూస్ ఇప్పుడు రజినీకాంత్ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

ముంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ డాన్ లా కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్, ఓవరాల్ గా ఇంప్రెస్ చేసింది. కానీ ఈ టీజర్ తరవాత ఈ సినిమాకి సంబంధించి మరే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి రాలేదు. దాంతో నిజంగానే ఈ సినిమా రిలీజ్ డేట్ ని పొడిగించే ప్లాన్ లో ఉన్నారా..? అనే ఆలోచన కలిగిస్తుంది.

ఏది ఏమైనా ‘కబాలి’ తరవాత మరోసారి సెట్స్ పైకి వచ్చిన ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని ధనుష్ నిర్మిస్తున్నాడు.