‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ స్టార్

Wednesday,April 11,2018 - 04:37 by Z_CLU

అల్లు అర్జున్  ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గ్రౌండ్ వర్క్ బిగిన్ అయింది. రీసెంట్ గా రిలీజైన డైలాగ్ ఇంపాక్ట్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

ప్రస్తుతానికి ఫిల్మ్ మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు మ్యాగ్జిమం ఈ ఈవెంట్ ఈ నెల 28 న లేదా  29 న జరిగే చాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ చేసి ఇంప్రెస్ చేసిన సినిమా యూనిట్,  ఈ నెల 13 న రిలీజవుతున్న మరో రొమాంటిక్ సాంగ్ ‘బ్యూటిఫుల్ లవ్’ ని రిలీజ్ చేయనుంది. ఈ సింగిల్ కోసం ఆల్రెడీ ఫ్యాన్స్ లో కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు శరత్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్. విశాల్ – శేఖర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు.