ఎమీని ఆకాశానికెత్తేసిన సూపర్ స్టార్

Friday,November 16,2018 - 11:03 by Z_CLU

దేశమంతా 2.0 ఫీవర్ ఊపందుకుంది. స్వయంగా సూపర్ స్టార్ ప్రమోషన్ లోకి దిగడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. స్వతహాగా తన సినిమాలకు ఎలాంటి ప్రచారం చేయరు రజనీకాంత్. అలాంటిది 2.0 కోసం ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన హీరోయిన్ ఎమీ జాక్సన్ ను ఆకాశానికెత్తేశారు.

“ఎమీ జాక్సన్ చాలా సిన్సియర్. సినిమాలో ఆమె మెటల్ లాంటి బట్టలు వేసుకోవాలి. నిజానికి అది మెటల్ కాదు. కాకపోతే మెటల్ లుక్ వచ్చేలా మందమైన లెదర్ తో తయారుచేసిన దుస్తులవి. అవి వేసుకొని వంగడం కూడా చాలా కష్టం. చాలా ఇబ్బందిగా ఉంటాయి ఆ దుస్తులు. అలాంటి దుస్తుల్లో సినిమా అంతా ఆమె కనిపిస్తుంది. అంటే ఎంత కష్టపడిందో అర్థంచేసుకోవచ్చు.

అలాంటి దుస్తులతో ఎమీ జాక్సన్ యాక్షన్ సీన్స్ చేసిందని, ఓ హీరోయిన్ కు అంతకంటే డెడికేషన్ ఇంకేముంటుందని అంటున్నారు రజనీకాంత్. ఎమీ కష్టానికి తను ఫిదా అయ్యానంటున్నారు.

“మన హీరోయిన్లంటే కాస్త వేడిని తట్టుకుంటారు. కానీ ఎమీ జాక్సన్ ది మన దేశం కాదు. లండన్ నుంచి వచ్చింది. వేడి అస్సలు తట్టుకోలేదు. అలాంటిది ఈ దుస్తులు వేసుకొని, ఔట్ డోర్ షూటింగ్ లో పాల్గొంది. హాట్సాఫ్ ఎమీ.”

ప్రపంచవ్యాప్తంగా ఈనెల 29న గ్రాండ్ గా విడుదలకానుంది 2.0 సినిమా. భారీ ఎత్తున త్రీడీ ఫార్మాట్ లో విడుదలవుతున్న మొట్టమొదటి ఇండియన్ మూవీ కూడా ఇదే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రచారంతో కలుపుకొని దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు.