హ్యాపీ బర్త్ డే టు రజనీకాంత్

Tuesday,December 12,2017 - 11:17 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఒకేసారి 2 సినిమాలు చేస్తున్న ఈ హీరో కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకుంటున్నాడు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.0 సినిమాలో నటిస్తున్నాడు రజనీకాంత్. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.

మరోవైపు పా.రంజిత్ దర్శకత్వంలో చేస్తున్న కాలా సినిమాను కూడా ఓ కొలిక్కి తీసుకొచ్చాడు రజనీకాంత్. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి సెకెండ్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజైంది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమాకు నిర్మాత.

67 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు రజనీకాంత్. సినిమాలే తనకు ఊపిరని ప్రకటించిన సూపర్ స్టార్.. మరిన్ని సినిమాలు చేసి ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే టు రజనీ సర్.