యాక్షన్ సీన్ తో ఎన్టీఆర్ మూవీ ప్రారంభం

Wednesday,April 11,2018 - 08:06 by Z_CLU

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం (ఏప్రిల్ 13) నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు రామోజీ ఫిలింసిటీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా ఎన్టీఆర్ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారు.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే పూజా హెగ్డే కూడా జాయిన్ అవుతుంది. తమన్ ఈ సినిమాకు ఇప్పటికే 2 ట్యూన్స్ కంపోజ్ చేశాడు.

లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతోంది ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్టీఆర్ పోషించని విభిన్నమైన పాత్రలో ఇందులో కనిపించబోతున్నాడట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. దాదాపు 16 కిలోలు తగ్గి స్లిమ్ అయ్యాడు.