రజినీకాంత్ 2.0 ట్రేలర్ రిలీజ్ డేట్

Thursday,June 22,2017 - 01:10 by Z_CLU

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య జనవరి 25 న రిలీజ్ కి రెడీ అవుతుంది రజినీకాంత్ 2.0. వరల్డ్ వైడ్ గా ఏకంగా 15 భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా రిలీజ్ కి ఇంకా 6 నెలల టైమ్ ఉన్నా, ఈ సినిమా ఫ్యాన్స్ లో రోజు రోజుకీ క్యూరాసిటీ రేజ్ చేస్తూనే ఉంటుంది. ఆ క్యూరాసిటీ మధ్య మరో ఇంటరెస్టింగ్ అప్ డేట్ ఫిలిం నగర్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

 

 

అప్పుడెప్పుడో ఈ సినిమా ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఓ వైపు సినిమా పోస్ట్ పనులను కానిస్తూనే, మరో వైపు ఈ సినిమా ట్రేలర్ పై కూడా కాన్సంట్రేట్ చేస్తుంది. డిసెంబర్ 12 న సూపర్ స్టార్ రజినీ కాంత్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే ట్రేలర్ తో ఎట్రాక్ట్ చేసే ప్లాన్ లో ఉంది సినిమా యూనిట్. రజినీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.