ఎంగురి డ్యామ్‌లో `పిఎస్‌వి గ‌రుడువేగ` షూటింగ్‌

Thursday,June 22,2017 - 12:33 by Z_CLU

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గరుడ వేగ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుకం జార్జియాలో జరుగుతోంది. దేశంలోనే అతిపెద్దదైన ఎంగురి డ్యామ వద్ద ఈ సినిమా షూటింగ్ చేశారు. జార్జియాకు మూడొంతులు పైగా ఎల‌క్ట్రిసిటీ, తాగునీటిని స‌రఫ‌రా చేసే డ్యామ్ ఇది. జార్జియా ప‌శ్చిమాన ఉన్న ఈ డ్యామ్ ప్ర‌పంచంలోనే 6వ ఎత్తైన (891 అడుగులు) డ్యామ్. ఈ ప్రాంతంలో 7 రోజుల పాటు యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు.

గుంటుర్ టాకీస్ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎడ్వెంచరస్ గా తెరకెక్కుతోంది గరుడువేగ.రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ గృహిణి పాత్ర‌లో న‌టిస్తుంది. జార్జ్ అనే క‌రుగుగ‌ట్టిన విల‌న్ పాత్ర‌లో కిషోర్ కనిపించనున్నాడు.

హీరో రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది గరుడవేగ. బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ ఈ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా నడుస్తోంది.