ఆగష్టులో రజినీకాంత్ 2.0 టీజర్ రిలీజ్

Tuesday,July 31,2018 - 04:29 by Z_CLU

భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతుంది రజినీకాంత్ 2.0 సినిమా. అయితే కంప్లీట్ కాన్సంట్రేషన్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పై ఫిక్స్ చేసిన ఫిలిమ్ మేకర్స్ ఆగష్టులో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా టీజర్ విషయంలో ఫిలిమ్ మేకర్స్ నుండి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘గోల్డ్’ సినిమాతో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందనే న్యూస్ ఓవరాల్ గా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

అక్షయ్ కుమార్ ‘గోల్డ్’ ఆగష్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది. ఈ సినిమాతో పాటే 2.0 టీజర్ కూడా అటాచ్ చేస్తారని టాక్. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ న్యూస్ అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా.? లేక జస్ట్ రూమర్ గా మిగిలిపోతుందా..? అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. అక్షయ్ కుమార్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. A.R. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.