రేపటి నుండే ‘శైలజా రెడ్డి అల్లుడు’ హంగామా

Tuesday,July 31,2018 - 03:23 by Z_CLU

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నాగచైతన్య సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఆగష్టు 31 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ విషయం ఈ రోజే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఫిలిమ్ మేకర్స్. అయితే ఇదే స్పీడ్ లో ఈ సినిమా టీజర్ కి కూడా ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంది ఈ సినిమా యూనిట్. రేపు సాయంత్రం 7: 10 నిమిషాలకి ఈ సినిమా టీజర్ రిలీజ్  కానుంది.

ఈ సినిమాలో నాగ చైతన్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ  సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ ఏమై ఉంటుంది అనే క్యూరియాసిటీ ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ లో రేజ్ అయి ఉంది. అందుకే రేపు రిలీజవుతున్న ఈ సినిమా టీజర్ ఫై ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ ఫిక్స్ అయి ఉంది.

మారుతి సినిమా అంటేనే ఒరిజినల్ కంటెంట్. కనెక్టింగ్ ఇమోషన్స్ తో ఫుల్లీ లోడెడ్ హ్యూమర్ ఎలిమెంట్స్ తో సినిమాను ప్లాన్ చేసుకుంటాడు. అందునా నాగచైతన్య కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై మరిన్ని అంచనాలున్నాయి.

రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా సితార  ఎంటర్ టైన్ మెంట్స్  బ్యానర్ పై తెరకెక్కుతుంది. గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో చైతు సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది.