రాజశేఖర్ ఇంటర్వ్యూ

Tuesday,October 31,2017 - 05:50 by Z_CLU

రాజశేఖర్ హీరోగా నటించిన PSV గరుడవేగ నవంబర్ 3 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ నుండి మొదలు రిలీజ్ కి రెడీ అయ్యేలోపు జరిగిన ఇంట్రెస్టింగ్ జర్నీని మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఆ చిట్ చాట్ మీకోసం….

దాని కన్నా ఇదే ముఖ్యం

చాలారోజుల గ్యాప్ తరవాత మంచి సినిమా చేశాను. ఎన్ని రోజుల తరవాత చేశాను అనే దానికన్నా ఎలాంటి సినిమా చేశాము అనేదే ఇంపార్టెంట్. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.

అదే డిఫెరెన్స్

గతంలోని వేరే లాంగ్వేజెస్ లో సినిమాలు చూసి నేను ఎంజాయ్ చేసిన సినిమాలను రీమేక్ చేశాను. కానీ బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. రీజన్ అవి మంచి సినిమాలే కాకపోతే నా ఇమేజ్ కి, నా ఇన్నాళ్ళ ఎక్స్ పీరియన్స్ కి మ్యాచ్ అయ్యే సినిమాలు కావు. కానీ PSV గరుడవేగ అలా కాదు. ఎగ్జాక్ట్ గా నేను చేయాల్సిన సినిమా…

అనుమానంగానే ఉండేది

ప్రవీణ్ గారు కథ చెపిన బౌండ్ స్క్రిప్ట్ చేతిలో పెట్టారు. స్క్రిప్ట్ చదగానే షాక్ అయిపోయాను. ఇంత అద్భుతంగా రాశారు. ఇంతే అద్భుతంగా ఎగ్జిక్యూషన్ చేయగలరా అనే అనుమానం వచ్చింది. సినిమా సెట్స్ పైకి వచ్చాక NIA ఆఫీస్ సెట్ లో ఫస్ట్ డే షూటింగ్ జరిగాక అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది.

ఆ టైమ్ లో ఈ చాన్స్ రావడం షాకే…

కంప్లీట్ గా లో టైమ్ లో ఉన్నప్పుడు నాకీ అవకాశం వచ్చింది. అందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తారా..? అని అడిగే టైమ్ లో ప్రవీణ్ ఈ సబ్జెక్ తో రావడం నిజంగా నా అదృష్టం. అందునా కోటేశ్వర్ రావు గారు ఏ మాత్రం భయపడకుండా 30 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ సినిమాని నిర్మించడం నిజంగా నా అదృష్టం.

రషెస్ చూసినప్పుడే తెలిసిపోయింది…

ఈ సినిమా నా కరియర్ లో ఫస్ట్ 5 లో ఉండటం ఖాయం. ఫస్ట్ ప్లేస్ లో కూడా నిలవచ్చు. సినిమా అంత అద్భుతంగా వచ్చింది.

 

సినిమాలో థ్రిల్లింగ్ పాయింట్ అదే..

చాలామందికి సినిమా టైటిల్ అర్థం కాలేదు కానీ, సినిమాలో అసలైన థ్రిల్లింగ్ పాయిట్ అదే… సినిమా చూస్తే అదేంటో అర్థమైపోతుంది. ఒక NIA ఆఫీసర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేదే సినిమా..

రియలిస్టిక్ గా ఉంటుంది…

ఒక NIA ఆఫీసర్ ఏం చేసినా అది దేశభక్తి రిలేటెడ్ అయినా, వైఫ్ తో ఉండే కాన్వర్జేషన్ అయినా ఎలిమేట్ ఏదైనా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది.

క్రెడిట్ మొత్తం అతనికే…

కంప్లీట్ గా లో గా ఫీల్ అవుతున్న టైమ్ లో ఈ సినిమాను నాతో చేయాలనుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఎక్స్ పెక్ట్ చేసినదానికన్నా చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది.

విలన్ గా చేస్తా…

మంచి పవర్ ఫుల్ విలన్ రోల్స్ వస్తే నేను చేయడానికి రెడీ. బాలకృష్ణ గారి సినిమాలో విలన్ గా చేయాలని ఉంది. కాకపోతే క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండాలి.