ప్రభాకర్ ఇంటర్వ్యూ

Tuesday,October 31,2017 - 04:10 by Z_CLU

ప్రభాకర్ డైరెక్షన్ లో ఆది హీరోగా తెరకెక్కిన నెక్స్ట్ నువ్వే నవంబర్ 3 న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రభాకర్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు..

అల్లు శిరీష్ కోసం రాసుకున్నాను

ఈ సినిమా అల్లు శిరీష్ కోసమని రాసుకున్నాను. ఒకరోజు కలిసి కథ చెప్పాను. కథ చాలా బావుందండీ కాకపోతే నేనిలాంటి జానర్స్ చేయకూడదనుకుంటున్నాను అని శిరీష్ చెప్పారు. కానీ సినిమా మాత్రం మన బ్యానర్ లో చేద్దామన్నారు… అలా హీరోతో పాటు నిర్మాతలు కూడా మారిపోయారు.

 

అదృష్టంగా ఫీల్ అవుతున్నాను

శ్రీవాస్, నా ఫ్రెండ్ చిన్నా, SPM గారు కలిసి చేయాల్సిన సినిమా ఇది.  వి-4 బ్యానర్ అనగానే వాళ్ళు కూడా హ్యాప్పీగా డ్రాప్ అయిపోయారు. అంత పెద్ద బ్యానర్ లో అవకాశం దొరకడం అనేది నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.

సీన్ రివర్స్

అల్లు అరవింద్ గారికి కథ నచ్చగానే ఒక ఇంచార్జ్ తో పాటు స్టోరీ డెవెలప్ చేసుకోవడానికి మరో రైటర్ ని కూడా ఇచ్చారు, కానీ వాళ్లకు నాకు సెట్ అవ్వక కంప్లీట్ గా కథ మారిపోయింది. ఆ తరవాత ఎవరికీ నచ్చక అల్లు అరవింద్ గారి పర్మిషన్ తో నేనొక్కడినే  కథ రాసుకుని మళ్ళీ వెళ్లాను. ఈ లోపు ఈ కథ కాదు కానీ, మంచి సినిమా ఉంది రీమేక్ చేద్దామన్నారు. దాంతో సీన్ మొత్తం రివర్స్ అయింది.

సినిమా చూడగానే నచ్చేసింది

అల్లు అరవింద్ గారు చెప్పగానే నెక్ట్స్ నువ్వే తమిళ వెర్షన్ చూశాను. బావుంది కానీ రీమేక్ ఈజీ కాదు చాలా మార్పులు చేయాలనిపించింది. ఎక్కడెక్కడ మార్పులు చేయాలో డిస్కస్ చేసి కంప్లీట్ గా తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా. ఆ తరవాత ఆదిని అప్రోచ్ అయ్యాం, వెంటనే ఓకె అనేశారు.

నో లాజిక్స్

సినిమాలో కామెడీ పండించే ప్రాసెస్ లో లాజిక్స్ ని మైండ్ లో పెట్టుకుంటే కష్టమే. లాజిక్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడే కామెడీ పండుతుంది.

సాయి కార్తీక్ అద్భుతం చేశాడు

ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. సాయికార్తీక్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. సాయి కార్తీక్ కు సాంగ్స్ విషయంలో ఓ 90% నాలెడ్జ్ ఉందనిపించినా, రీ రికార్డింగ్ విషయంలో మాత్రం 100% నాలెడ్జ్ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాకి తనే పెద్ద ఎసెట్.

నెక్స్ట్ సినిమా వివరాలు

మారుతి ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాను. దాదాపు 75% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కన్నడ స్టార్ సుమన్ శైలేంద్ర ఈ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇషా హీరోయిన్. మూడో సినిమా స్టూడియోగ్రీన్ తో కమిట్ అయ్యాను.

హీరోకి రిలాక్సేషన్ ఉండదు

సినిమా బిగిన్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు హీరోకి రిలాక్స్ అనేదే ఉండదు. గర్ల్ ఫ్రెండ్ ఉండగా ఇంకో అమ్మాయిని ట్రై చేస్తుంటాడు. కంప్లీట్ స్టోరీలో బిజీగా ట్రావెల్ చేస్తుంటాడు.

నెక్స్ట్ నువ్వే – ఫైనల్ స్టేట్ మెంట్

నెక్స్ట్ నువ్వే సినిమా పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ సినిమా. ఎక్కువగా సెంటిమెంట్స్ ఉండవు. పర్టికులర్ ఆడియెన్స్ ని టార్గెట్ చేయకుండా అందరికీ నచ్చేలా సినిమా చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం.