ఆ హీరోతో రాజమౌళి  ?

Sunday,May 28,2017 - 11:10 by Z_CLU

టాలీవుడ్ లో ప్రెజెంట్ రాజమౌళి నెక్స్ట్ సినిమా పై భారీ చర్చే జరుగుతుంది. లేటెస్ట్ గా ‘బాహుబలి’తో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అందుకొని దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు అందుకున్న రాజమౌళి బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా.. ఆ సినిమాకు హీరో ఎవరా.. అనే ప్రశ్నలు ఫిలిం నగర్ సర్కిల్ లో హంగామా చేస్తున్నాయి.

బాహుబలి కోసం దర్శకుడిగా 5 ఏళ్ళ పాటు శ్రమించిన రాజమౌళి ప్రెజెంట్ ఫామిలీ తో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే . అయితే లేటెస్ట్ గా రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య నిర్మాణంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్నాడనే టాక్ టాలీవుడ్ లో గట్టిగానే చక్కర్లు కొడుతుంది.. మరి ప్రెజెంట్ వక్కంతం-లింగుస్వామి తో సినిమాలు కమిట్ అయిన బన్నీ రాజమౌళి తో సినిమా చేస్తాడా.. ఒక వేళ రాజమౌళి కోసం మిగతా డైరెక్టర్స్ ను పక్కన పెడతాడా..? అసలు ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…