మహేష్ లిస్ట్ లో మరో డైరెక్టర్

Sunday,May 28,2017 - 10:03 by Z_CLU

ప్రెజెంట్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ సినిమాలో నటిస్తున్న మహేష్ ఈ సినిమాను ఇప్పటికే ఓ కొలిక్కి తీసుకొచ్చి మరో వైపు కొరటాల సినిమాను కూడా సెట్స్ పై పెట్టేశాడు. కొరటాల సినిమాను కూడా అదే స్పీడ్ తో ఫినిష్ చేసి వంశీ పైడిపల్లి తో ఓ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు మహేష్ ..

ప్రెజెంట్ మహేష్ లిస్ట్ లో వంశీ పైడి పల్లి తో పాటు రాజమౌళి, త్రివిక్రమ్ వంటి టాప్ దర్శకులు కూడా ఉన్న సంగతి తెలిసిందే..ఇదిలా ఉండగా ఇప్పుడు మహేష్ అప్ కమింగ్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి మరో డైరెక్టర్ వచ్చి చేరాడు. గతంలో మహేష్ తో ‘టక్కరి దొంగ’ సినిమాను తెరకెక్కించిన జయంత్ సి.పరాంజీ కూడా మహేష్ తో త్వరలోనే ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో మహేష్ తో సినిమా గురించి అడగగా..” టక్కరి దొంగ నుంచి మహేష్ తో టచ్ లోనే ఉన్నానని మేమిద్దరం కలిసి మరో సినిమా చేద్దామనుకుంటున్నామనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం.. అందుకు నేను ఒక డిఫరెంట్ స్టోరీ అనుకుంటుండగా మహేష్ మాత్రం లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడని త్వరలోనే మహేష్ తో సినిమా ఉంటుందని తెలిపాడు.. సో మహేష్ అప్ కమింగ్ లిస్ట్ లో దర్శకుడు జయంత్ కూడా ఉన్నాడన్న మాట.