నాని 'మజ్ను' లో రాజమౌళి ?

Saturday,August 27,2016 - 12:49 by Z_CLU

నాని హీరోగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ బ్యానర్ లో విరించి వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మజ్ను’. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ప్రస్తుతం  ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర యూనిట్. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాలో ఒక ముఖ్య సందర్భం లో వచ్చే సన్నివేశం లో రాజ మౌళి నాని తో కలిసి కనిపించనున్నాడట. ఈ గెస్ట్ రోల్ లో మీరు కనిపిస్తే బాగుంటుందని నాని చెప్పగానే ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట జక్కన్న. మరి ఈ చిత్రం లో రాజమౌళి ఏ సన్నివేశం లో కనిపిస్తారో? వేచి చూడాల్సిందే.