Dasara Movie - దసరా మూవీ సెకెండ్ సింగిల్ వచ్చేస్తోంది!

Friday,February 10,2023 - 01:02 by Z_CLU

Nani’s Dasara Movie Second Song Ori Vaari Releases On Feb 13th

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’. టీజర్, సాంగ్ తో ఈ సినిమా అంచనాల్ని పెంచేసింది. తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13 ‘ఓరి వారి’ అనే హార్ట్‌బ్రేక్ సాంగ్ ని విడుదల చేయనున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది.

దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు

దసరా చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics