'నేను పక్కా లోకల్'.. అంటున్న కాజల్

Saturday,August 27,2016 - 03:05 by Z_CLU

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ ఉన్నట్టుండి ఐటెం గర్ల్ అవతారమెత్తింది. కెరీర్ లో తొలి సారిగా ఎన్.టి.ఆర్ కోసం ఐటెం గర్ల్ గా మరి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది ముంబై ముద్దు గుమ్మ.  కొరటాల శివ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న’జనతా గ్యారేజ్’ లో ‘నేను పక్కా లోకల్’ అంటూ ఎన్.టి.ఆర్ తో కలిసి స్టెప్స్ వేయబోతుంది కాజల్. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1 న విడుదలకి సిద్దమైన ఈ చిత్రం లో కాజల్ పక్కా లోకల్ పాట  సినిమాకు హైలైట్ గా నిలవనుందని చెప్తున్నారు చిత్ర యూనిట్. విడుదలకి ముందే మోస్ట్ ఫెవరెట్ సాంగ్ గా అందరినీ ఆకట్టుకున్న ఈ పాట తో కాజల్ విడుదల తరువాత ఎలా అలరిస్తుందో? చూడాల్సిందే…