ఆ సినిమాలో జక్కన్న ఉన్నాడు... కానీ...

Saturday,November 19,2016 - 08:30 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో గెస్ట్ రోల్స్ ఎక్కువయ్యాయి. ఆ మధ్య స్టార్ హీరోలు అడపాదడపా గెస్ట్ రోల్స్ చేసి అభిమానులను అలరిస్తే…. ఇప్పుడు కుర్ర హీరోలు, డైరెక్టర్స్ కూడా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు షాక్ ఇచ్చి అలరిస్తున్నారు.

ఈ మధ్య నాని నటించిన ‘మజ్ను’ సినిమా స్టార్టింగ్, ఎండింగ్ లో కనిపించిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా నిఖిల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంలో కూడా మరోసారి అలాంటి గెస్ట్ రోల్ చేశాడనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. రాజమౌళి ఎప్పీయరెన్స్ ఉందనే పుకారు… సినిమాకు కాస్తో కూస్తో పబ్లిసిటీ కూడా తెచ్చిపెట్టింది. తీరా మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత అందులో రాజమౌళి లేకపోవడంతో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఉత్తిదే అని తేలిపోయింది. సినిమాలో ఒక సందర్భంలో టీవీలో మాత్రమే కనిపిస్తాడు జక్కన్న. అంతే తప్ప ప్రత్యేకంగా ఓ రోల్ అంటూ ఏదీ లేదు. అయితే జక్కన్న ఉన్నాడనే రూమర్ మాత్రం సినిమాకు బాగా ప్లస్ అయింది.