కీర్తి సురేష్ నుంచి మరో సినిమా

Saturday,November 19,2016 - 07:30 by Z_CLU

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ తో సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతుండడంతో… ఈనెల బాక్సాఫీస్ డల్ గా తయారైంది. చెప్పుకోడానికి ఒక్క సినిమా కూడా లేదు. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు రెమో. నవంబర్ 25 న థియేటర్స్ లోకి వచ్చేస్తానంటున్నాడు. శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా నటించిన సినిమానే రెమో. తెలుుగు-తమిళ భాషల్లో అదే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను టాలీవుడ్ లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. విలక్షణ పాత్రలకు పెట్టింది పేరైన శివకార్తికేయన్, ఈ సినిమాలో నర్సుగా లేడీగెటప్ లో కనిపించనున్నాడు. ఈమధ్య కాలంలో హీరోలు లేడీ గెటప్పులు వేయడం తగ్గించేశారు. ఇలాంటి టైమ్ లో శివకార్తికేయన్ ఈ గెటప్ వేయడం అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. పైగా టాలీవుడ్ లో కూడా ఫేమస్ అయిన కీర్తి సురేష్, ఇందులో హీరోయిన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.