రాజమౌళి ఫిక్స్ అయ్యాడు

Sunday,April 30,2017 - 11:00 by Z_CLU

ప్రపంచంతో పాటు బాహుబలి-2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా వెయిట్ చేసిన జక్కన్న ఎట్టకేలకి బాహుబలి-2 రిలీజ్ అయి తొలి రోజే ప్రశంసలు అందుకుంటూ గ్రాండ్ హిట్ అందుకోవడంతో తన హాలిడే ట్రిప్ పై ఫోకస్ పెట్టాడు.

బాహుబలి కోసం దర్శకుడిగా దాదాపు 5 ఏళ్ల పాటు రాత్రీపగలూ తేడా లేకుండా కష్టపడిన జక్కన్న ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే తన కుటుంబంతో ఓ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు.. అయితే రాజమౌళి తన హాలిడేస్ ను ఎక్కడ గడపబోతున్నాడు..అనేది మొన్నటి వరకూ సస్పెన్స్ కాగా ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు. త్వరలోనే తన ఫ్యామిలీ తో సౌత్ ఆసియా లో ఉన్న భూటాన్ వెళ్లి అక్కడ అందమైన లొకేషన్స్ లో హాలిడేస్ ను ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలిపాడు జక్కన్న. ఈ హాలిడే ట్రిప్ తర్వాతే తన నెక్స్ట్ సినిమా ఏంటనేది.. ఎవరితో అనేది.. అనౌన్స్ చేస్తాడట .