కొత్త దర్శకుడితో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ?

Sunday,November 19,2017 - 03:06 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెంట్ ‘నా పేరు సూర్య’ సినిమాతో సెట్స్ పై ఉన్న సంగతి తెల్సిందే.. రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో యాక్షన్ మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత బన్నీ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికే బన్నీ నెక్స్ట్ లిస్ట్ లో లింగుస్వామి తో పాటు విక్రమ్ కుమార్ పేరు వినిపిస్తుండగా ఇప్పుడు ఈ లిస్ట్ ఓ కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. ఇటీవలే ఓ యంగ్ టాలెంటెడ్ చెప్పిన స్క్రిప్ట్ బన్నీ కి నచ్చడంతో ఆ వ్యక్తి తన సినిమాతో డైరెక్టర్ గా పరిచయం చేయాలనీ డిసైడ్ అయ్యాడట. ప్రెజెంట్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నాడని టాక్. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.