సెంటిమెంట్ తో ఎన్టీఆర్

Sunday,April 30,2017 - 12:00 by Z_CLU

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒక్కొక్కరిది ఒక్కో సెంటిమెంట్.. పైకి అలాంటివేం లేదంటూనే ఆ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు కూడా.. ప్రెజెంట్ ఎన్టీఆర్ కూడా ఓ సెంటిమెంట్ ను ఫాలో అవ్వాలని చూస్తున్నాడట.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమాను ఆగస్టు లో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే…

ఈ సినిమా ఆ డేట్ కి రావడం కష్టమే అనే టాక్ వినిపిస్తుంది.. ‘జై లవకుశ’ సినిమా ఆగస్టు నుంచి సెప్టెంబర్ కి షిఫ్ట్ కానుందనే టాక్ కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న సినిమా కావడం, హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండడం, ఇంకా హీరోయిన్స్ పై చిత్రీకరించాల్సి షూట్ మొదలు కాకపోవడం పైగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా టైం పడుతుండడంతో మేకర్స్ ఈ సినిమా కోసం సెప్టెంబర్ లో ఓ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలనీ భావిస్తున్నారట.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన సెప్టెంబర్ 1న జై లవకుశ రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట.  మరి ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతాడో..లేదో..తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..