ముగ్గురూ రె'ఢీ'...

Sunday,November 19,2017 - 01:00 by Z_CLU

డిసెంబర్ ఎండింగ్ లో ముగ్గురు యంగ్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. వారిలో ముందున్నాడు నేచురల్ స్టార్ నాని… నాని నటించిన ‘MCA’ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21 న రిలీజ్ కానుంది… ఆ మరుసటి రోజే ‘హలో’ అంటూ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్. ఈ ఇద్దరితో పాటు మెగా హీరో అల్లు శిరీష్ కూడా డిసెంబర్ 23 తన లేటెస్ట్ మూవీ ‘ఒక్క క్షణం’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించి షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి కి తీసుకొచ్చిన ఈ యంగ్ హీరోలు ప్రెజెంట్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకొని పోటీ కి రెడీ అయిపోయారు. సో సంక్రాంతి కి బాక్సాఫీస్ దగ్గర బడా హీరోలు పోటీ పడుతుంటే వారి కంటే ముందే క్రిస్మస్ కి ఇలా యంగ్ హీరోలు పోటీ పడబోతున్నారన్నమాట. మరి ఈ మూడు సినిమాలతో ఈ ముగ్గురు యంగ్ హీరోలు ఎలాంటి హిట్స్ అందుకుంటారో.. చూడాలి.