నిఖిల్ 'కేశవ' రిలీజ్ డేట్

Sunday,April 30,2017 - 10:00 by Z_CLU

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నిఖిల్ త్వరలోనే ‘కేశవ’ గా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై అభిషేక్‌ నామా నిర్మాతగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో రివేంజ్ యాక్షన్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, టీజర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి భారీ అంచనాలు నెలకొల్పింది..

నిఖిల్ సరసన రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో కనిపించనుంది. స్వామి రారా తర్వాత నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను మే 19న సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.